లడఖ్‌లో ప్రధాని మోడి ఆకస్మిక పర్యటన
లేహ్ లో సైనికులను కలిసిన ప్రధాని

న్యూఢిల్లీ: చైనాలో ఉద్రికత్తల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడి అకస్మాత్తుగా ఈ ఉదయం లడఖ్ లోని సరిహద్దులకు వెళ్లారు. ఆయన వెంట త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కూడా ఉన్నారు. సైనిక బలగాల నైతిక స్థైర్యం పెంచేందుకు ఆయనే స్వయంగా లడక్‌లో పర్యటిస్తున్నారు. జూన్ 15న చైనా బలగాల దాడిలో గాయపడి లేహ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను ప్రధాని మోడి పరామర్శించనున్నారు. కాగా ప్రధాని ఈ పర్యటనలో సైనిక దుస్తుల్లో కనిపిస్తున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సైనికులకు సెల్యూట్ చేసి, వారి భుజాలు తడుతూ అభినందించారు. కరోనా భయాలను పక్కనబెట్టి, జవాన్లతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా జవాన్లంతా జై హింద్ అని నినాదాలు చేస్తుంటే, మోడి కూడా వారితో కలిసి భరతమాతకు జైకొట్టారు. వాస్తవానికి నేడు రాజ్ నాథ్ సింగ్ లడఖ్ వెళతారని రెండు రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. అయితే, రాజ్ నాథ్ స్థానంలో ప్రధానే స్వయంగా వెళ్లి, సైనికుల్లో ధైర్యాన్ని నింపాలని నిర్ణయించుకున్న మీదటే, ఆయన పర్యటనకు ఏర్పాట్లు జరిగాయని తెలుస్తోంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: