ఆచార్య : సంప్రదాయ లుక్ లో పూజా హగ్దే ..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కి్స్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో రోల్‌లో నటిస్తుండగా..ఆయనకు జోడి గా పూజా హగ్దే నటిస్తుంది. పూజా బర్త్ డే సందర్భాంగా ఆమె తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసి ఆకట్టుకున్నారు.

ఈ చిత్రంలో నీలాంబరి పాత్రలో పూజా నటిస్తోందని తెలిపారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో లంగా, ఓణిలో అచ్చతెలుగు అమ్మాయిలా సంప్రదాయబద్ధంగా కనిపిస్తున్న పూజా ఎంతో ఆకట్టుకుంటోంది.తెలుగుతో పాటు పలు భాషల్లో ఫిబ్రవరి 4 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ధర్మస్థలి అనే ఊరి నేపథ్యంలో సాగే విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తుండగా మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.