వైసీపీలో విషాదం : ప్రకాశం జిల్లా పార్టీ సీనియర్ నేత మృతి

వైసీపీ పార్టీ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా పార్టీ సీనియర్ నేత, దర్శి మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చిరెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో ఒంగోలులో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.కాంగ్రెస్‌ పార్టీ నుంచి రెండు​ పర్యాయాలు 1989, 1999లలో దర్శి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. పిచ్చిరెడ్డి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.