కెసిఆర్ కల్లిబొల్లి మాటలను ప్రజలకు వివరించాలిః పొంగులేటి

బిఆర్ఎస్ ను భూస్థాపితం చేయాలన్న పొంగులేటి

ponguleti-fires-on-kcr

హైదరాబాద్‌ః ముఖ్యమంత్రి కపట నాటకాలను ప్రజలు గమనించాలని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో బిఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలను, కెసిఆర్ కల్లిబొల్లి మాటలను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. బిఆర్ఎస్ ను భూస్థాపితం చేసి, కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు శ్రమించాలని పిలుపునిచ్చారు. జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీకి రుణపడి ఉన్నామని పొంగులేటి చెప్పారు. సోనియా భిక్షతోనే కెసిఆర్ సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తుండటంతో కెసిఆర్ సరికొత్త డ్రామాలను తెరతీస్తారని అన్నారు. తొమ్మిదేళ్ల పాటు ఆర్టీసీని పట్టించుకోని కెసిఆర్.. ఇప్పుడు ఎన్నికలు రావడంతో వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్టు ప్రకటించారని విమర్శించారు. తనకు పదవి లేకపోయినా నాలుగున్నరేళ్లుగా ప్రజలకు అండగా ఉంటున్నానని చెప్పారు.