వరద సహాయంలోనూ రాజకీయమా?

రాజకీయ లబ్ధికై పేదల నోళ్లపై కొట్టడం ఇదేం రాజకీయం!

Politics in flood relief
Politics in flood relief?

ప్రకృతి చూడటానికి ఎంత ఆహ్లాదకరంగా అందంగా, ప్రశాంతంగా చూడముచ్చటగా ఉంటుందో ఒక్కసారి కన్నెర్ర చేస్తే దాని ఉగ్రరూపం అంత భయంకరంగా ఉంటుంది.

తన ప్రళయాన్ని చూపించడం మొదలుపెడితే దానిని ఆపే నాధుడే ఉండడు.అంతటి శక్తివంతమైనది ఈ ప్రకృతి.

అలాంటి ప్రకృతి వైపరీత్యంలో భాగమే మొన్న హైదరాబాద్‌లో సంభవించిన వరదలు.నాలుగు శతాబ్దాల ఘనచరిత్ర కలిగిన విశ్వనగరం హైదరాబాద్‌.

ఇక్కడ అత్యంత కటికపెదవాడి నుండి అష్ట ఐశ్వర్యాలు కలిగిన కోటీశ్వరుడి వరకు అందరూ ఆహ్లాదకరంగా జీవించే అనువైన వాతావరణం కలిగిన ప్రదేశం.

హైదరాబాద్‌ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వనగరాల్లోఒకటి.

అలాంటి హైదరాబాద్‌లో మొన్న కురిసిని కుండపోత వర్షాల కారణంగా అతలా కుతలమై ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదుర్కుందో ప్రత్యే కంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

1908 తర్వాత మొట్ట మొదటి సారిగా ఇంతలా వర్షాలు పడడం మూలన వరదలు ముంచెత్తడమంటే ఆలోచించదగ్గ విషయం.

ఈ వరదలకారణంగా దాదాపు నగరవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా పేద మధ్య తరగతి కుటుంబాలు దయనీయమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది.

పదుల్లో ప్రాణనష్టం కోట్లలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తుల నష్టం సంభవించిన సంగతి విదితమే.

ఈ సందర్భంగా ఈ విపత్కర పరిస్థితుల్లో సకాలంలో స్పందించి వరద బాధితులకు వెన్నంటే నిలిచిన తెలంగాణ ప్రభుత్వం మరికొన్ని స్వచ్ఛంద సంస్థల పనితీరు హర్షణీయం.

అధికార యంత్రాంగం మొత్తంరంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తర లించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం మాన వత్వానికి నిదర్శనం.

ఈ వరదల సమయంలో పోలీసు, వైద్య పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవ వారు ప్రదర్శించిన ధైర్యసాహ సాలు మరువలేనివి.

లేకపోతే వరదల ప్రభావంతో వ్యాపించే అంటురోగాలతో సంభవించే ప్రాణ,ఆస్తినష్టం ఊహకందనిదని మేధావ్ఞలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వరదల కారణంగా కూడు, గుడ్డ అనేవి కాస్త ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి.

ఉన్న నిత్యావసర సరుకులు వరదల్లో కొట్టుకుపోవడం, పాడైపో వడం జరిగింది.

అందుకు ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉండే ప్రజానీకానికి పదివేల ఆర్థిక సహకారాన్ని ప్రకటించడమే కాకుండా వాటిని వెనువెంటనే బాధితులకు అందించడం ప్రారంభించింది.

అయితే దానిని మరోకోణంలో చూసిన కొంత మంది పెద్దలు రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో విజయా నికై ఓటర్లను ప్రభావితంచేయడానికి ఈ ఆర్థికసహకారం అంటూ ప్రత్యక్షంగా విమర్శలుచేస్తూ అడ్డుకోవడం జరిగింది.

దాంతో ప్రభుత్వం ద్వారా బాధితులకు అందే సహకారం నిలిచిపోవడం జరిగింది.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సహకారాన్ని అందించాల్సినవారే రాజకీయ లబ్ధికై పేద, మధ్యతరగతి ప్రజల నోళ్లపై కొట్టడం ఇదేం రాజకీయం.

కొంత మంది సహకారం అందకపోవడంతో ఆకలితో అలమటి స్తున్నారు. ఇకపోతే కొన్ని కొన్ని చాలా సున్నితమైన విషయాలు సందర్భాలుంటాయి.

అలాంటి విషయాల్లో జన,గణ, మన అనే బేధాలు చూపకపోవడం అనేది మానవుని ప్రాథమికవిధి.

అంతే కాని ఈ విపత్కర పరిస్థితులను సైతం తమ స్వార్థ ప్రయోజనాలకై రాజకీయం చేయడమనేది నాయకత్వ లక్షణం అనిపించు కోదని కొంతమంది బాధితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వాలు కూడా ఇప్పుడున్న డ్రైనేజీ వ్యవస్థల ఎప్పుడో నిజాంకాలం నాటిది దానిని మారుతున్న కాలానికి అనుగు ణంగా ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునికరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అంతేకాకుండా కబ్జాలకు గురైనా, గురవుతున్న చెరువుకు సంబంధించిన భూమునలు పరిరక్షించాల్సిన అవసరం ఉంది.

అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితులు సంభవించకుండా నూతన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని వెంటనే అమలుపర్చాలి.

పర్యావరణ పరిరక్షణకు పూర్తిస్థాయిలో కృషి చేసినప్పుడే ఇలాంటి విపత్కర పరిస్థితులను కొంతమేరకైనా అధిగమించగలం.

  • అంజద్‌ మియా

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/