సైదాబాద్‌ ఘటన ఫై మహేష్ ఎమోషనల్ ట్వీట్..మన కూతుళ్లు సురక్షితంగానే ఉంటారా.?

సైదాబాద్‌ సింగ‌రేణి కాల‌నీలో ఇటీవ‌ల 6 ఏళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యంత దారుణంగా అత్యాచారం చేయ‌డంతోపాటు హ‌త్య చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంఘ‌ట‌న‌పై యావ‌త్ ప్రజానీకం భ‌గ్గుమంటోంది. నిందితున్ని అదుపులోకి తీసుకుని క‌ఠినంగా శిక్షించాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు, ప్ర‌జా సంఘాలు, మ‌హిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటన ఫై చిత్రసీమ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మంగళవారం సినీ హీరో మంచు మనోజ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి నిందితుడ్ని త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరగా..తాజాగా మహేష్ బాబు సైతం ట్విట్టర్ ఈ ఘటన ఫై భావోద్వేగానికి గురయ్యారు.

‘హైదరాబాద్‌ సింగరేణి కాలనీలో 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన దారుణమైన ఘటన.. సమాజంలో పడిపోతున్న విలువలకు తార్కాణంగా నిలుస్తోంది. ఈ సమాజంలో మన కూతుళ్లు సురక్షితంగానే ఉంటారా.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ కుటుంబం ఈ బాధను ఎలా తట్టుకుంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. అధికారులు వెంటనే తగిన చర్యలను తీసుకొని చిన్నారి కుటుంబానికి సరైన న్యాయం చేయాలని కోరుతున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.

మరోపక్క పోలీస్ శాఖ సైతం నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రివార్డు అందిస్తామని ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

The heinous crime against the 6-year old in Singareni Colony is a reminder of how far we have fallen as a society. “Will our daughters ever be safe?”, is always a lingering question! Absolutely gut-wrenching.. Cannot imagine what the family is going through!— Mahesh Babu (@urstrulyMahesh) September 14, 2021