నవంబర్ 2 నుంచి ఆస్ట్రాజెనెకా టీకాలు

టీకా పంపిణీని ప్రారంభించేందుకు నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్)  సిద్ధం

AstraZeneca vaccines

London: కరోనా మహమ్మారికి కళ్లెం వేసేందుకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకా నవంబర్ 2 నుంచి అందుబాటులోకి రానుంది.

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పత్రిక కథనం ప్రకారం నవంబరు 2 నుంచి టీకా పంపిణీని ప్రారంభించేందుకు నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్)  సిద్ధమౌతోంది.

తొలి దశలో కోవిడ్ వారియర్స్ అయిన వైద్యులు, నర్సులు, ఇతరులకు పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/