బీహార్‌లోని దర్భంగలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని

YouTube video
PM Shri Narendra Modi addresses public meeting in Darbhanga, Bihar

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి దర్భంగలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నింటినీ నెరవేర్చడమే తమ లక్ష్యమని ప్రకటించారు. గత ప్రభుత్వాల చూపు ఎప్పుడూ కమిషన్ల మీద మాత్రమే ఉండేదని, ప్రజల అవసరాలపై ఉండేది కాదని విమర్శించారు. కొన్ని రోజుల క్రిందటే మహాసేతును ఆవిష్కరించాం. దీని ద్వారా రైతులు, వ్యాపారులతో పాటు విద్యార్థుల ప్రయాణాల సమయం తగ్గుతుందన్నారు. అంతేకాకుండా ఉపాధి దొరకడానికి కూడా అవకాశం ఉందన్నారు. ఓటు వేసే సందర్భంగా ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రామ మందిర నిర్మాణం జరుగుతున్న సందర్భంగా ప్రధాని బిహార్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/