భారత కళాఖండాలను అప్పగించినందుకు కృతజ్ఞతలు : మోడీ

YouTube video
PM Modi’s remarks at India-Australia virtual summit

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ , ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ల మధ్య ద్వైపాక్షిక శిఖరాగ్ర భేటీ వర్చువల్ గా సోమవారం మధ్యాహ్నం జరిగింది. ముందు ప్రధాని మోడీ నమస్కార్ తో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ను పలకరించారు. భారత్ కు చెందిన విలువైన కళాకృతులను తిరిగి అప్పగించినందుకు భారత ప్రజల తరఫున ఈ సందర్భంగా ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు.

గత కొన్నేళ్లలో మన బంధం ఎంతో బలోపేతం అయింది. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, విద్య, ఆవిష్కరణలు, సైన్స్, టెక్నాలజీ తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య సన్నిహిత సహకారం ఏర్పాటైంది’’అని మోడీ గుర్తు చేశారు. క్వీన్స్ లాండ్, న్యూ సౌత్ వేల్స్ లో వరదల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడడం పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం అంశాన్ని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ప్రస్తావనకు తెచ్చారు. ఈ పరిమాణాల నేపథ్యంలో ప్రాంతీయంగా ఎదురయ్యే సవాళ్లపై చర్చించేందుకు అవకాశం లభించిందంటూ.. ప్రాంతీయ సహకారానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేశారు.

కాగా, భారత్ కు చెందిన అరుదైన 29 కళాఖండాలు ఇవన్నీ కూడా రాజస్థాన్, పశ్చిమబెంగాల్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, తదితర రాష్ట్రాలకు చెందినవి. అక్రమంగా ఆస్ట్రేలియాకు చేరిన వీటిని అక్కడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో వాటిని ఆ దేశం తాజాగా భారత్ కు అప్పగించింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/movies/