మాజీ ప్రధాని దేవేగౌడతో సీఎం కెసిఆర్ భేటీ

దేశ రాజకీయాలపై చర్చిస్తున్న కేసీఆర్
రాష్ట్రపతి అభ్యర్థిపై కూడా కొనసాగుతున్న చర్చ

cm-kcr-meet-former-prime-minister-deve-gowda

బెంగళూరు: సీఎం కెసిఆర్ మాజీ ప్రధాని దేవేగౌడతో భేటీ అయ్యారు. ఈ ఉదయం హైదరాబాదు నుంచి బెంగళూరుకు కేసీఆర్ ప్రత్యేక విమానంలో వెళ్లిన సంగతి తెలిసిందే. బెంగళూరుకు చేరుకున్న ఆయన దేవేగౌడ నివాసానికి వెళ్లారు. ఆయనకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్వాగతం పలికారు. వీరు ముగ్గురు ప్రస్తుత దేశ రాజకీయాలపై చర్చిస్తున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి గురించి కూడా చర్చలు జరుపుతున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలి కాలంలో జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్రను పోషించాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు ప్రాంతీయ పార్టీల నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన సమావేశం అవుతున్నారు. సాయంత్రం 4 గంటలకు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు కేసీఆర్ తిరుగుపయనమవుతారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/