మేడారం జాతర.. రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు

pm-modi-tweet-on-medaram-jatara-2024-sammakka-saralamma-jatara

న్యూఢిల్లీః మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల అతి పెద్ద పండుగల్లో సమ్మక్క – సారలమ్మ జాతర ఒకటి అంటూ పీఎం మోడీ అన్నారు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక అంటూ హర్షం వ్యక్తం చేశారు. మనమంతా ఆ వన దేవతలకు ప్రణమిల్లాలని సూచించారు. వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామని ఎక్స్​ వేదికగా ప్రధాని ట్వీట్​ చేశారు.

“గిరిజనుల అతి పెద్ద పండుగలలో సమ్మక్క – సారలమ్మ జాతర ఒకటి. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం. వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందాం.