ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధాని నోరు మెద‌పాలి : : ప్రియాంక గాంధీ

ల‌క్నో: ల‌క్నోలోని చిన్హ‌త్ ప్రాంతంలో ప్ర‌చార స‌భ‌ల్లో నేడు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కు సంబంధించి కీల‌క అంశాల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మాట్లాడాల‌ని అన్నారు. కాంగ్రెస్‌, ఎస్పీ ఉగ్ర‌వాదుల ప‌ట్ల సానుభూతివైఖ‌రి ప్ర‌ద‌ర్శిస్తున్నాయ‌న్న ప్ర‌ధాని ఆరోప‌ణ‌ల‌పై ప్రియాంక స్పందించారు. మోడీ ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌ని ఆయ‌న‌కు కూడా తెలుస‌ని అయితే ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కేందుకే ఆయ‌న ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని దుయ్య‌బట్టారు. యూపీలో పెద్ద‌సంఖ్య‌లో ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఎందుకు భ‌ర్తీ చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌ధాని ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై నోరు మెద‌పాల‌ని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/