సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా

సూపర్‌ ఓవర్‌లో కూడా భారత్‌ విజయం

Team India
Team India

హామిల్టన్: హామిల్టన్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన టీ20 మ్యాచులో ఇండియా గెలుపు అందుకుంది. కోహ్లీ సేన సూపర్ ఓవర్లో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని కివీస్ అందుకోలేకపోయింది. కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 179/5 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ విజేత నిర్ణయించారు. ఈ సూపర్‌ ఓవర్‌లో మొదట న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌కు దిగింది. వారిపై జాస్ప్రిత్‌ బుమ్రా బౌలింగ్‌ చేశాడు. ఈ సూపర్‌ ఓవర్‌లో న్యూజిలాండ్‌ 17 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ దిగిన ఇండియా 18 పరుగులు చేసింది. దీంతో మూడో టీ20 లో ఇండియా గెలిచింది. అంతేకాదు ఐదు టీ20ల సిరీస్‌ ను కూడా టీమిండియా కైవసం చేసుకుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/