74వ గణతంత్ర దినోత్సవ వేడుకల విశేషాలను పోస్ట్ చేసిన ప్రధాని మోడీ

pm-modi-shares-highlights-of- 74th-republic-day-programme-2023

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ గణతంత్ర వేడుకల విశేషాలను పోస్ట్ చేశారు. అయితే, 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల విశేషాలను సంబంధించిన ఓ వీడియోను గురువారం రాత్రి 8.30 గంటలకు తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో మోడీ పోస్ట్ చేశారు. ఈ వీడియో మొత్తం 3 నిమిషాల 3 సెకన్లు. ఈ వీడియోలో, ప్రధాని తన నివాసం నుంచి కర్తవ్యపథ్‌లో కవాతు ముగిసే వరకు దృశ్యాలు ఇందులో చూపించబడ్డాయి.

ఢిల్లీలో గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ యుద్ధ స్మారకం సందర్శనతో గణతంత్ర వేడుకలు ప్రారంభం అయ్యాయి. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులతో కలిసి.. కర్తవ్యపథ్‌గా పేరు మారిన తర్వాత తొలిసారిగా జరిగిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా జాతీయ జెండాను ఆవిష్కరించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అనంతరం త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. ఈ వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా అల్‌ సిసి.. ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చాలా స్పెషల్‌గా కనిపించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ డ్రెస్ చాలా ప్రత్యేకంగా నిలిచింది. రాజస్థానీ తలపాగా ధరించి కనిపించారు. తెలుపు కుర్తా-పైజామా, నలుపు కోటుతో రంగురంగుల తలపాగాతో విభిన్నంగా ఉన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/