అనంత‌పురం రోడ్డు ప్ర‌మాదం..మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ప్రధాని

అనంత‌పురం: అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాద మృతులకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి మృతులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు ప్రకటించారు. నిన్న అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి వద్ద రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోకా వెంకటప్ప కుమారై వివాహం జరిగింది. అనంతరం బళ్లారి నుంచి బంధువులతో కలిసి ఇన్నోవా వాహనంలో వస్తున్న సమయంలో కారును కంటైనర్ ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న 9 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/