విజయరాజే సింధియా స్మారకార్థం రూ.100 నాణెం విడుదల

PM Modi releases commemorative coin in honour of Rajmata Vijaya Raje Scindia.Scindia

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి విజ‌య‌రాజే సింధియా 100వ‌ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని కేంద్ర ఆర్థిక‌శాఖ ముద్రించిన ఈ ప్ర‌త్యేక కాయిన్‌ను వ‌ర్చువ‌ల్ విధానంలో లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడుతూ.. రాజ‌మాత విజ‌య‌రాజే సింధియా పేద ప్ర‌జ‌ల కోసం త‌న జీవితాన్ని అంకితం చేశార‌ని చెప్పారు. ప్ర‌జాప్ర‌తినిధులకు రాజ‌భోగాల కంటే ప్ర‌జాసేవే ముఖ్యం అనే విష‌యాన్ని విజ‌య‌రాజే సింధియా నిరూపించార‌ని ప్ర‌ధాని మోడి కొనియాడారు. త్రిపుల్ తలాక్‌కు వ్య‌తిరేకంగా చ‌ట్టం చేయ‌డం ద్వారా.. దేశంలో స్త్రీ సాధికార‌త కోసం రాజ‌మాత సింధియా క‌న్న క‌లల‌‌ను కొంతమేర‌కు నెర‌వేర్చ‌గ‌లిగామ‌ని ఆయ‌న చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/