ప్రతి ఒక్కరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలుః ప్రధాని మోడీ

pm-modi-extends-new-year-wishes-to-people

న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ కొంగొత్త ఆశలు, ఆకాంక్షలతో ప్రపంచమంతా కొత్త సంవత్సరంలోకి ఎంతో ఉత్సాహంగా అడుగు పెట్టింది. ఎన్నో ఆశలను మోసుకొచ్చిన ఈ నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికింది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదిలో ప్రజలంతా సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో శాంతియుతంగా ఉండాలని ఆకాంక్షించారు. ‘‘ప్రతి ఒక్కరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఈ సంవత్సరం అందరికీ శ్రేయస్సు, శాంతి, అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నా’’ అని ‘ఎక్స్‌’లో మోడీ పోస్టు పెట్టారు. మోడీకి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ నెటిజన్లు పోస్టులు పెట్టారు.

మరోవైపు ప్రస్తుతం భారత్‌ సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉందని మోడీ ఆదివారం ప్రసారమైన ‘మన్‌ కీ బాత్‌’ 108వ ఎపిసోడ్‌లో చెప్పిన విషయం తెలిసిందే. ఆత్మనిర్భరతను 2024లోనూ కొనసాగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.