భారీ భూకంపం..ఈ విషాదకర సమయంలో నేపాల్ కు అండగా ఉంటాంః ప్రధాని మోడీ

ఎంతో ఆవేదన కలుగుతోందన్న మోడీ

PM Modi assures all help to Nepal after earthquake, says India stands in solidarity

న్యూఢిల్లీః హిమాలయ దేశం నేపాల్ ను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కనీసం 128 మంది ప్రజల ప్రాణాలను హరించింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఎన్నో ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఎంతో మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.

ఎక్స్ వేదికగా మోడీ స్పందిస్తూ… నేపాల్ లో భూకంపం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధను కలిగిస్తోందని చెప్పారు. ఈ విషాదకర సమయంలో నేపాల్ కు అండగా ఇండియా ఉంటుందని… అన్ని రకాల సహాయ సహకారాలను నేపాల్ కు అందిస్తామని తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ (ప్రచండ)ను ట్యాగ్ చేశారు.