ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని అబుదాబి చేరుకున్న ప్రధాని మోడీ

ఘన స్వాగతం పలికిన కింగ్ షేక్ ఖలీద్

PM Modi arrives in UAE, meets President Mohammed bin Zayed Al Nahyan

దుబాయిః రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనను ముగించుకున్న ప్రధాని మోడీ యూఏఈలో అడుగుపెట్టారు. అబుదాబి విమానాశ్రయంలో ఆయనకు యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి రాజు షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. ఎనర్జీ, ఫుడ్ సెక్యూరిటీ, ఢిఫెన్స్ రంగాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. యూఏఈలో ఎక్కువగా భారతీయులే ఉన్నారు. మొత్తం జనాభాలో 30 శాతం మనవాళ్లే నివసిస్తున్నారు.