నూతన సంవత్సరం రోజే..రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ – కేంద్ర ప్రభుత్వం

నూతన సంవత్సరం నాడు రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 20 వేల కోట్ల రూపాయలు బదిలీ చేయబోతున్నారు. పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.6 వేలను జమ చేయనుంది. అయితే ఈ డబ్బులను కేంద్రం ఒకేసారి కాకుండా విడుదల చేయకుండా విడతల వారిగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ప్రతి విడతలోనూ రూ. 2 వేలను నేరుగా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి పంపిస్తుంది. ఇప్పటివరకు తొమ్మిది విడతల వారిగా నగదు జమ చేసింది కేంద్రం.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇప్పటివరకు 1.6 లక్షల కోట్ల రూపాయలను రైతుల బ్యాంకుల ఖాతాలకు బదిలీ చేసింది కేంద్రం. పీఎం కిసాన్ స్కీమ్ కింద జనవరి 1న మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే కార్యక్రమంలో ప్రధాన మంత్రి రైతుల ఖాతాల్లోకు బదిలీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి 351 ఎఫ్పీఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (FPO)లకు 14 కోట్ల రూపాయల ఈక్విటీ గ్రాంట్‏ను కూడా విడుదల చేస్తారు. దీంతో 1.24 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది.