కేరళ ఎన్నికలలో కాంగ్రెస్‌ సత్తా చాటుతుందా?

ఇప్పటికే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన రాహుల్‌

Congress party
Congress party


భారతదేశ ఫెడరల్‌ వ్యవస్థను బలపరుస్తూ కాలానుగుణంగా జరిగే ఎన్నికల్లో గత 70 సంవత్సరాలుగా ప్రజలే అధికారాన్ని నిర్ణయిస్తున్నారు. 56 సంవత్సరాలు ఏకైక పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లోనూ అధికారాన్ని చెలాయించింది కాంగ్రెస్‌ పార్టీ.

130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం చురుకైన, సమర్థవంతమైన వ్యూహం, సరైన నిర్ణయాలు, బలవంతమైన నాయకత్వం లేక అధికారాన్ని చేజిక్కించుకోలేకపోతుంది.ఒకవేళ చేజిక్కించుకున్నా కూడా సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకోకుండా మూడు నాలుగు రాష్ట్రాల్లో అధికారానికి దూరమైంది.

ఉత్తరభారతంలో కాంగ్రెస్‌పార్టీ అధికా రాన్ని పొందడానికి పురిటినొప్పులు పడుతుంది. కాని దక్షిణ భారత రాష్ట్రాలలో గతంలోనే పవర్‌కు దూరమైంది కాంగ్రెస్‌పార్టీ. కాని కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ యుపిలో ఓడిపోయినా కేరళ నుండి లోక్‌సభకు ఎన్నికవ్వడమే కాక కేరళ, తమిళనాడులో చెప్పుకోదగ్గ లోక్‌సభ సీట్లు గెలుపొందింది.

ఇప్పుడు 2021 జూన్‌లో కేరళ రాష్ట్రానికి, అలాగే బెంగాల్‌, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలకు సాధారణ ఎన్నికలు అసెంబ్లీకు జరగబోతున్నాయి. కనుక కేరళ నుండి కాంగ్రెస్‌ అధ్యక్షుడు (కాబోయే) రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కనుక యునైటెడ్‌ డెమోక్రాటిక్‌ పార్టీని తిరిగి రాష్ట్రంలో అధికారానికి తెచ్చే సత్తాను కలిగిఉన్నాడా? అనే విషయాన్ని పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు. కేరళ రాష్ట్రం భారత్‌లో విభిన్నమైన రాష్ట్రం. ఎందుకంటే రాష్ట్రం పూర్తిగా విద్యా వంతమైనది. కేరళలో ఉద్యోగులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. దేశంలో మొట్టమొదటి మొబిలిటీని పొందినవారు కేరళీ యులు. వారు ఎన్నికలలో భిన్నమైన తీర్పును ఇస్తుంటారు. అంతే గాక 1959లో ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలు నిర్వ హించింది. కాని ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కామ్రెడ్‌ నంబూద్రి ప్రసాద్‌ను ఓడించలేకపోయింది. అనంతరం ఒక గ్రూపు లెఫ్ట్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ కమ్యూనిస్టుల నాయకత్వాన్ని పొందితే మరొక సారి యునైటెడ్‌ డెమోక్రాటిక్‌ గ్రూపు (యుడిఎఫ్‌) అధికారాన్ని చేజిక్కించుకుంది. కనుక ప్రస్తుతం కేరళలో అధికారాన్ని చెలాయిస్తున్న ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం యాంటి ఎస్టాబ్లిష్‌మెంట్‌ను ఎదుర్కోవడమేకాక బంగారం స్కామ్‌, తదితర స్కామ్‌లలో ఇరుక్కొంది.

ఎపిడమిక్‌ కొవిడ్‌-19ను సమర్థవంతంగా ఎదుర్కొని అతి తక్కువ మరణాలను నమోదు చేసుకుంది. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను ప్రజలకు ఉచితంగా అందచేయడానికి చర్యలు తీసుకొంది. అదే అందరికి విద్య జాతీయ విద్యావిధానం అమలు చేస్తుంది. అలాగే కేంద్రం నుండి గ్రామీణాభివృద్ధి పనులను 78,79 రాజ్యాంగ సవ రణ విధానాన్ని అమలుచేస్తూ ప్రణాళిక నిధులు,16వఆర్థికసంఘం నిధులను పొంది గ్రామాలలో జనజీవితాన్ని మెరుగుపర్చుతుంది. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా రాజ్యాంగం ప్రకారం వచ్చే నిధులు వస్తూనే ఉంటాయి. ఇటీవల కొవిడ్‌ కాలంలోనే స్థానిక ప్రభుత్వాలకు ఎన్నికలు నిర్వహించగా కమ్యూనిస్టుపార్టీల ఎలయన్స్‌పార్టీలే అత్యధిక సీట్లు గెలుచుకొన్నాయి. ఎల్‌డిఎఫ్‌ గ్రూపు అధికారంలో నున్నా కూడా 2019లో సాధారణంగా ఎం.పి సీట్లను ఎక్కువగా యు.డిఎస్‌ గెల్చుకొంది.అంటే కేరళలో విద్యావంతులైన ఓటర్లు ఏ సంకీర్ణ పార్టీలను అధికారంలో ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉంచరు.

కనుక ఒకసారి యుడిఎల్‌ గెలిచినా మరోసారి ఎల్‌డిఎఫ్‌ గెలిచి పాలన సాగిస్తుంది. కేవలం ఏ గ్రూపుకైనా ఐదు సంవత్సరాలు ఒక టర్మ్‌ మాత్రమే ఓటరు ఓటు వేయడం సాధా రణం.దక్షిణ ప్రాంత రాష్ట్రాలైన తమిళనాడులోనూ, బెంగాలులోనూ కూడా అధికారాన్ని వదులుకొని మిగతా రాష్ట్రాలలో మాత్రమే పరిమితమైంది.అంటే 1980 వరకు మెజారిటీ రాష్ట్రాలలో కాంగ్రెస్‌అధికారాన్ని దక్కించుకొన్న బెంగాల్‌,తమిళనాడు,కేరళలోను అధికారాన్ని కాంగ్రెస్‌కోల్పోయింది. కాంగ్రెస్‌కు ముందుచూపులేక పోవడం వలన ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ప్రదేశ్‌,నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరం, సిక్కింలలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఏకంగా బిజెపిలో చేరి అధికారాన్ని బిజెపికి కట్టబెట్టారు. అంటే కాంగ్రెస్‌పార్టీ కేరళలో యుడిఎఫ్‌ ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది. కనుక 2021లో జరిగేఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌ను ఓడించి యుడిఎఫ్‌ అధికారాన్ని దక్కించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యుడిఎఫ్‌ కాంగ్రెస్‌ నాయకత్వంలో పలు సమస్యల మీదపోరాటం సాగిస్తుంది.

అందులో ముఖ్యంగా రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన మూడుచట్టాలను రద్దు చేయవలసిందని, రైతులు పండించే పంటలకు కనీస మద్దతుధరని అమలు చేయాలని కోరుతున్న రైతుల ఉద్యమానికి మద్దతునిస్తూ, అధిక ధరలకు కారణమైన పెట్రోలు ధరలు పెంచడం వలన మధ్యతరగతి నడ్డి విరుస్తున్న ప్రభుత్వాన్ని ఎండగడుతూ, అలాగే కొవిడ్‌-19 ఎపి ిడమిక్‌వలన లాక్‌డౌన్‌ ఐదు నెలలు పూర్తిగా పాటించడంతో సామాన్య ప్రజలు, పేదలు, రోజువారి కూలీలు చాలా కష్టపడుతున్నారు.నిరుద్యోగం, పాక్షిక ఉద్యోగాలతో మధ్యతరగతి జనం అష్టకష్టాలుపడుతున్నారు. అటు కేంద్రం జిఎస్టీ పేరుతో వసూలు చేయడం, ఇటు రాష్ట్రం అమ్మకం పన్ను, అబ్కారీ పన్నులను కట్టలేక జనం నానా ఇబ్బందులు పడుతున్నారు.కనుక వీటిని కేరళలోజరిగే ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా పనిచేస్తూ యుడిఎఫ్‌కు మద్దతుగా ఓట్లు అడగవచ్చు.

కనుక అధికార ప్రభుత్వాన్ని గద్దెదించే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. అంతేగాక కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రతి వారం పార్టీ కార్యాలయంలో తిరువనంతపురం ఇతర ప్రాంతాలలో తిరిగి యుడిఎఫ్‌ తరపున ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఏదిఏమైనా కేరళ ఓటర్లు రాబోయే ఎన్నికలలో ఏదో ఒక గ్రూప్‌కు స్పష్టమైన మెజారిటీని కట్టబెడతారు. దేశంలో లెఫ్ట్‌ పార్టీలచే నిర్వహించబడుతున్న ప్రభుత్వం తిరిగి అధికారానికి రావడం అనేది గ్యారంటీ లేదు. అటు కాంగ్రెస్‌, ఇటు కమ్యూనిస్టులకు కూడా గెలుపు అత్యవశ్యకం.

  • డాక్టర్‌ కె. ఆసయ్య, ఐఐఎస్‌

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/