ఫోన్ ట్యాపింగ్ అంశం..మంత్రి కొండా సురేఖతో పాటు మరో ఇద్దరికి కెటిఆర్‌ లీగల్‌ నోటీసులు

Phone tapping issue.. KTR legal notices to Minister Konda Surekha and two others

హైదరాబాద్‌ః ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మంత్రి కొండా సురేఖతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లీగల్ నోటీసులు పంపారు. కెటిఆర్ నోటీసులు పంపిన వారిలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డి ఉన్నారు. తన పరువుకు భంగం కలిగేలా తనపై చేసిన తప్పుడు ఆరోపణలపై వారంలోగా క్షమాపణ చెప్పాలని… లేకపోతే పరువు నష్టం దావా వేస్తానని నోటీసులో ఆయన పేర్కొన్నారు. ఈ ఉదయం ప్రెస్ మీట్ లో కెటిఆర్ మాట్లాడుతూ.. తనపై దుష్ప్రచారం చేస్తే మంత్రి అయినా, సీఎం అయినా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తనకు ఏ హీరోయిన్ తో సంబంధం లేదని… వాళ్ల ఫోన్లు ట్యాప్ చేయించాల్సిన కర్మ తనకు లేదని అన్నారు.