ఏపీలో కరోనా ఉధృతం : 24 గంటల్లో 477 కేసులు
ఇప్పటిదాకా మొత్తం 8,929 కేసులు నమోదు

Amaravati: ఎపిలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు ఒక్క రోజులో నమోదయ్యాయి.. గడిచిన 24 గంటలలో కొత్తగా 477 కేసులు నమోదు అయ్యాయి.
వాటిలో వివిధ జిల్లాలకు చెందిన వారు 439 మంది, వలస కూలీలు 34 మంది, విదేశాల నుంచి వచ్చిన నలుగురు కి కరోనా నిర్ధారణ అయ్యింది.
దీంతో ఇప్పటి వరకు ఎపిలో నమోదైన కేసులు సంఖ్య 8,929 కి పెరిగింది.. వాటిలో 13 జిల్లాలలో 7056 కేసులు, విదేశాల నుంచి వచ్చిన 330 కేసులు, వలస కూలీల 1540 కేసులున్నాయి.. కాగా గడిచిన 24 గంటలలో అయిదుగురు మరణించారు..
కృష్ణాలో ముగ్గురు, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో ఒక్కరు చోప్పున మృతి చెందారు. దీంతో ఎపిలో ఇప్పటి వరకు 106 మంది మరణించారు.
ఇప్పటివరకు 3 వేల 354 మంది వివిధ జిల్లాలోనూ, వలస కూలీలు 901 మంది, ఎన్నాఆర్ ఐలు 52 మంది కోలుకుని హాస్పటల్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు..
ప్రస్తుతం జిల్లాలలో 3,599 యాక్టివ్ కేసులు ఉండగా, విదేశాల నుంచి వచ్చిన 278 మంది, వలస కూలీలు 639 మంది వివిద హాస్పటల్స్ లో చికిత్స పొందుతున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/