జనం చెవిలో జగన్ పూలు పెట్టారు : నారా లోకేశ్
విద్యుత్ ఛార్జీల తగ్గింపు, మద్య నిషేధం వంటివి అమలు కావట్లేదన్న లోకేశ్

అమరావతి: ఏపీలో పెరిగిపోతోన్న విద్యుత్ ధరలపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ధరలు అన్నింటినీ తగ్గిస్తానని ఎన్నికల ముందు చెప్పిన జగన్ ఇప్పుడు పెంచుకుంటూ పోతున్నారని ఆయన అన్నారు.
ఎన్నికల హామీల విషయంలో రాష్ట్ర ప్రజల్ని జగన్ ఏప్రిల్ ఫూల్ చేశారని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. జనం చెవిలో జగన్ పూలు పెట్టారని, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, మద్య నిషేధం హామీ, ప్రత్యేక హోదా సాధన, సన్న బియ్యం పంపిణీ హామీలన్నీ అమలు చేయకుండా ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేశారని లోకేశ్ అన్నారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/