మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన పవన్ కొడుకు అకిరా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా..ఎప్పుడెప్పుడు హీరోగా ఇండస్ట్రీ లో అడుగుపెడతాడా అని యావత్ అభిమానులు ఎదురుచూస్తున్న క్రమంలో..హీరోగా కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. ఈ విషయాన్ని హీరో అడివిశేష్ సోషల్ మీడియా లో తెలిపారు.

‘రైటర్స్‌ బ్లాక్‌’ అనే ఓ లఘు చిత్రానికి అకిరా సంగీతం అందిస్తున్నట్లు దీని లింక్‌ను ట్విటర్‌లో షేర్‌ చేసి టీమ్‌కు అభినందనలు తెలిపారు అడివిశేష్. తనకెంతో ఇష్టమైన అకీర ఈ సినిమాకు మ్యూజిక్‌ అందించాడని అడివిశేష్ తెలిపాడు. ఒక రచయిత.. కథను రాయడంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాడు అనే కథాంశంతో ఈ లఘు చిత్రం రూపుదిద్దుకుంది. ఇంగ్లీష్‌లో తెరకెక్కిన ఈ షార్ట్‌ ఫిల్మ్‌కు కార్తికేయ యార్లగడ్డ దర్శకత్వం వహించగా… మనోజ్‌ నటించాడు.

ఫణి మాధవ్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు అకీరా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. నాలుగున్నర నిమిషాల నిడివి గల ఈ ఫిల్మ్‌కు అకిరా అందించిన మ్యూజిక్‌ ఆకట్టుకునేలా ఉందని.. అకీరాకు మ్యూజిక్‌ అంటే ఎంతో ఆసక్తి అంటూ అడవి శేషు తెలిపారు. అతడు ప్రత్యేకంగా పియానో ప్లే చేయడం నేర్చుకున్నాడు. గతంలో తన స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘దోస్తీ’ పాటను పియానోపై ప్లే చేసి.. అందరి దృష్టిని ఆకర్షించాడు.