ఇంటి కుసుమాల వనం బిళ్ల గన్నేరు

పరిసరాలు … మొక్కల పెంపకం

పూల మొక్కలు ఉంటే ఆ పరిసరాలు ఎంత అందంగా వుంటాయో అనుకోని వారుండరు.. కాల మేదైనా , మన ఇంటిని కుసుమాల వనంగా మార్చగలిగే మొక్కల్లో వింకా రోజ్ ఒకటి.. వీటిని ఎలా పెంచాలో చూద్దాం…

తళతళా మెరిసే ఆకుపచ్చని ఆకులు, రంగు రంగుల పూలతో మురిపించే ఈ మొక్కని మన తెలుగిళ్ళలో బిళ్ల గన్నేరు గా పిలుస్తారు… ఇది ఎలాంటి నెలలో అయినా సులువుగా నిలదొక్కు కుంటుంది.. విత్తనాలు, వేళ్ళను నాటి పెంచుకోవచ్చు.. తెలుపు, గులాబీ, ఎరుపు, పసుపు వంటి ఎన్నో వర్ణాల్లో దొరికి ఇది కుండీల్లోనూ చక్కగా పెరుగుతుంది..

తొట్టెల్లో పెట్టి బాల్కనీల్లో వేలాడదీయ వచ్చు.. అలాగే ఇంట్లో స్థలం కాస్త ఎక్కువ ఉంటే బోర్డర్ , రాక్ గార్డెన్ లాగా మలుచుకోవచ్చు. ఎంతటి ఎండను అయినా తట్టుకోగల ఈ మొక్క నీటి ఎద్దడిని తట్టుకోగలరు.. అయితే, మొక్కలు ఎక్కువగా పూలు పూయాలంటే ఎరువులు క్రమం తప్పక వేయాలి.. ముఖ్యంగా, నెలకోసారి ఎన్ పి కె సమాన నిష్పత్తిలో ఉండే ఎరువును నీళ్ళల్లో కలిపి అందిస్తే సరి.. బోలెడు పూలు పూస్తాయి.

జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/category/news/national/