తొలి వన్డేలో బంగ్లాదేశ్‌ గెలుపు

వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌

తొలి వన్డేలో బంగ్లాదేశ్‌ గెలుపు
Bangladesh win first ODI

ఢాకా : వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్‌ బోణీ చేసింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో బంగ్లా జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌లో ముందంజవేసింది. తొలుత వెస్టిండీస్‌ను 32.2 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌట్‌ చేసిన బంగ్లాదేశ్‌ అనంతరం 33.5 ఓవర్లలో 4 వికెట్లకు 125 పరుగులు చేసి విజయాన్నందుకుంది. పొదుపుగా బౌలింగ్‌ చేయడమేగాక 4 వికెట్లు పడగొట్టి బంగ్లా విజయంలో ముఖ్యపాత్ర వహించిన షకీబ్‌ అల్‌ హసన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. రెండో వన్డే శుక్రవారం ఇక్కడే జరుగుతుంది.

టాస్‌ గెలిచిన బంగ్లా కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు దింపాడు. ఆరంభంనుంచి వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ బంగ్లా బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడ్డారు. పేసర్‌ ముస్తాఫిజుర్‌ రెండు వికెట్లతో విండీస్‌ పతనానికి నాంది పలకగా, షకీబ్‌ అల్‌ హసన్‌ మిడిలార్డర్‌ను కుప్పకూల్చి విండీస్‌ పరాజయానికి బాటవేశాడు. మేయర్స్‌(40), రోవన్‌ పావెల్‌(28) మాత్రమే పర్వాలేదనిపించారు. ఆండ్రీ మెకార్ట్నీ(12), కెప్టెన్‌ జాసన్‌ మహమూద్‌(17) రెండంకెల స్కోర్లు సాధించినా వాటిని పెద్ద స్కోర్లుగా మలచడంలో విపలమయ్యారు.

చివరలో హసన్‌ మహమూద్‌ మూడు వికెట్లతో విండీస్‌ పరాజయానికి ముగింపు పలికాడు. షకీబ్‌ 4, మమహూద్‌ 3, ముస్తాఫిజుల్‌ 2 వికెట్లు దక్కించుకున్నారు. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌కు లిటన్‌ దాస్‌, కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ దాదాపు అర్ధసెంచరీ భాగస్వామ్యంతో శుభారంభం అందించారు.

లక్ష్యం చిన్నదే అయినందున ఇరువ్ఞరూ తొందరపడక నిదానంగా స్కోరును పెంచారు. 47 పరుగులు జోడించిన తరువాత లిటన్‌ దాస్‌ అకీల్‌ హుసేన్‌ బౌలింగ్‌లో అవ్ఞటయ్యాడు. తరువాత వచ్చిన నజ్ముల్‌ హుస్సేన్‌ ఒక పరుగుకే వెనుతిరిగినా తమీమ్‌, షకీబ్‌ అల్‌ హసన్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అర్ధసెంచరీ దిశగా సాగుతున్న తమీమ్‌ను జాసన్‌ మహ్మద్‌ అవ్ఞట్‌ చేసే సమయానికి బంగ్లాదేశ్‌ 83 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. స్కోరు వంద పరుగులు దాటించి షకీబ్‌(19)కూడా నిష్క్రమించారు. ఆపై ముష్ఫికర్‌(19నాటౌట్‌), మమ్మదుల్లా(9నాటౌట్‌) మరో వికెట్‌ పడకుండా లాంఛనాన్ని పూరించారు. అకీల్‌ హుసేన్‌ 3 వికెట్లు పడగొట్టాడు.

స్కోర్‌బోర్డ్‌ : వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ –

సునీల్‌ ఆంబ్రిస్‌ ఎల్బీ బి ముస్తాఫిజుర్‌ 7, జోషువా డి సిల్వ సి లిటన్‌ దాస్‌ బి ముస్తాఫిజుర్‌ 9, ఆండ్రీ మెకార్ట్నీ బి షకీబ్‌ అల్‌ హసన్‌ 12, జాసన్‌ మహ్మద్‌ స్టంప్డ్‌ రహీమ్‌ బి షకీబ్‌ అల్‌ హసన్‌ 17, మేయర్స్‌ సి లిటన్‌ దాస్‌ బి మెహది హసన్‌ 40, బోనర్‌ ఎల్బీ షకీబ్‌ అల్‌ హసన్‌ 0, రోమన్‌ పావెల్‌ సి రహీమ్‌ బి హసన్‌ మహ్మూద్‌ 28, రీఫర్‌ ఎల్బీ బి హసన్‌ మహ్మూద్‌ 0, అల్జరి జోసెఫ్‌ బి షకీబ్‌ అల్‌ హసన్‌ 4, అకీల్‌ హుసేన్‌ సి లిటన్‌ దాస్‌ బి హసన్‌ మహ్మూద్‌ 1, చెమర్‌ నాటౌట్‌ 0, ఎక్స్‌ట్రాలు 4, మొత్తం(32.2 ఓవర్లలో ఆలౌట్‌)122.
వికెట్ల పతనం : 1-9, 2-24, 3-45, 4-56, 5-56, 6,7-115, 8-121,9-122, 10-122.
బౌలింగ్‌ : రూబెల్‌ 6-0-34-0; ముస్తాఫిజుర్‌ 6-0-20-2; హసన్‌ మహ్మూద్‌ 6-1-28-3; షకీబ్‌ అల్‌ హసన్‌ 7.2-2-8-4; మెహ్ది హసన్‌ 7-1-29-1.

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌

లిటన్‌ దాస్‌ బి అకీల్‌ హసన్‌ 14, తమీమ్‌ ఇక్బాల్‌ స్టంప్డ్‌ జోషువా డసిల్వ బి జాసన్‌ మహ్మద్‌ 44, నజ్ముల్‌ హుస్సేన్‌ శాంతొ సి జాసన్‌ మహ్మద్‌ బి అకీల్‌ హుసేన్‌ 1, షకీబ్‌ అల్‌ హసన్‌ బి అకీల్‌ హుసేన్‌ 19, ముస్తాఫికర్‌ రహీమ్‌ నాటౌట్‌ 19, మహ్మదుల్లా నాటౌట్‌ 9, ఎక్స్‌ట్రాలు 19, మొత్తం(33.5 ఓవర్లలో 4 వికెట్లకు)125.
వికెట్ల పతనం :1-47, 2-57, 3-83, 4-105. బౌలింగ్‌ : అల్జరి జోసెఫ్‌ 8-3-17-0; చమర్‌ హోల్డర్‌ 3-0-26-0; అకీల్‌ హుసేన్‌ 10-1-26-3; జాసన్‌ మహ్మద్‌ 8-0-19-1; ఆండ్రీ మెకార్ట్నీ 2-0-10-0; ఎన్‌రుమా బోనర్‌ 2.5-0-15-0.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/