పశ్చిమ గోదావరి జిల్లాలో మొదలైన పవన్ కౌలు రైతు భరోసా యాత్ర..

కౌలు రైతు భరోసా యాత్ర లో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన చేపట్టారు. ఈ పర్యటన లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి , వారికీ ఆర్ధిక సాయం అందజేయనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో కలపర్రు టోల్‌గేటు వద్దకు చేరుకున్నారు. కలపర్రు టోల్ గేట్ వద్దకు వేల సంఖ్యలో తరలివచ్చిన జనసైనికులు, అభిమానులు జయ జయ ధ్వానాల నడుమ భారీ గజమాలతో సత్కరించారు.

ప్రస్తుతం జాతీయ రహదారి మీదుగా విజయరాయి, పెదవేగి, ధర్మాజీగూడెం, లింగపాలెంకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి మళ్లీ ధర్మాజీగూడెం మీదుగా చింతలపూడికి వెళ్తారు. చింతలపూడికి చేరుకునే మధ్యలో పలు గ్రామాల్లో కొందరు కౌలు రైతుల కుటుంబాలను కలుసుకుని ఒక్కో కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని పవన్ కళ్యాణ్ అందించనున్నారు. చింతలపూడి లో సాయంత్రం రచ్చబండ కార్యక్రమం చేపట్టనున్నారు.