కేశినేని నానిపై జగన్ ప్రశంసలు..

కేశినేని నానిపై వైస్సార్సీపీ మొండితోక జగన్ ప్రశంసలు కురిపించారు. 2014 ఎన్నికల ఫలితాల ముందు వరకు కూడా కేశినేని నాని తో పెద్దగా పరిచయం లేదని..ఫలితాల సమయంలో నాని నన్ను పలకరించారని జగన్ గుర్తుచేశారు. అప్పుడే నాతో మీకు నియోజక వర్గంలో మంచి పేరుంది అన్నారు. నియోజక వర్గ అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి వెళ్తానని.. ప్రజలు ఎంపీగా కేశినేనిని, ఎమ్మెల్యే గా నన్ను గెలిపించినపుడు మేం ఎందుకు మాట్లాడుకోకూడదని పేర్కొన్నారు.

మేం ఇద్దరం ప్రజలకు సేవ చేయాలి అనుకుంటామని.. టాటా ట్రస్ట్ సేవలు తేవటంలో కేశినేని కృషి ఉందని స్పష్టం చేశారు. రాజకీయ కోణంలో చూడటం వల్లే కేశినేని వ్యాఖ్యలు కొత్తగా అనిపిస్తాయి.. కేశినేని నాని సేవ చేయటం వల్లే ఆరు స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యే లు ఓడిపోయినా ఎంపీగా కేశినేని గెలిచారని వెల్లడించారు. కేశినేని సేవ చేయటం వల్లే ఎంపీగా కేశినేని గెలిచారన్నారు.