విజయవాడకు బయలుదేరిన పవన్‌ కల్యాణ్…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ కు బయలుదేరారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ను స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో CBI అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం నంద్యాలలో హైడ్రామా తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం విజయవాడలో 3వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో ఆయన్ను హాజరుపరచనున్నారు. ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబును పరామర్శించేందుకు హైదరాబాద్ నుండి విజయవాడ కు బయలు దేరినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ ఫై పవన్ స్పందించడం జరిగింది. ఏ తప్పూ చేయని నాయకులను జైల్లో పెట్టి వేధిస్తున్నారు..రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పట్ల పోలీసుల తీరు దారుణం అన్నారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. ప్రాథమిక ఆధారాలు చూపకుండా అరెస్ట్‌ చేయడం సరికాదన్నారు. లా అండ్ ఆర్డర్‌ను కాపాడాల్సింది పోలీసులే కదా? అని ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్‌ విషయంలో వైసీపీకి సంబంధమేంటి? అని అన్నారు. అరాచకాలు జరుగుతున్నది వైసీపీ వల్లే కదా?..నాయకుడు అరెస్టైతే.. అభిమానులు రోడ్లపైకి వస్తారని పవన్ అన్నారు. నాయకుడికి మద్దతుగా రావడం ప్రజాస్వామ్యంలో భాగమే అని ఇళ్లలో నుంచి బయటకు రాకూడదంటే ఎలా? అన్నారు. మీ నాయకులు అక్రమాలు, దోపిడీ చేసినా విదేశాలకు వెళ్లొచ్చు. ఒక నాయకుడు అరెస్టైతే కార్యకర్తలు బయటకురావొద్దా?..చంద్రబాబు అరెస్ట్‌ రాజకీయ కక్ష సాధింపు చర్యే అని పవన్ తెలిపారు.