శ్రీనివాస్ జవాను మృతి దురదృష్టకరం
జమ్మూ కశ్మీర్ పుల్వామా జిల్లాలో ఎన్ కౌంటర్..జవాను వీరమరణం

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ జమ్మూకశ్మీర్లో జరిగిన ఎన్ కౌంటర్ లో తెలంగాణకు చెందిన జవాను వీరమరణం పొందిన విషయంపై ట్విట్టర్లో స్పందించారు. పెద్దపల్లి జిల్లా నాగారం గ్రామానికి చెందిన సాలిగం శ్రీనివాస్ (28) తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దేశం మీద ప్రేమతో సైన్యంలో చేరిన శ్రీనివాస్ చిన్నవయసులోనే అమరజీవి కావడం ఎంతో బాధ కలిగించిందని తెలిపారు. చైనా సరిహద్దులో జరిగిన పోరాటంలో సంతోష్ బాబు అనే వీరుడ్ని కోల్పోయిన కొద్దిరోజుల వ్యవధిలోనే తెలంగాణ శ్రీనివాస్ ను కూడా కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. బాధాతప్త హృదయంతో నివాళి అర్పిస్తున్నట్టు వివరించారు. సంతోష్ బాబు కుటుంబాన్ని ఆదుకున్న విధంగానే కెసిఆర్ ప్రభుత్వం ఇప్పుడు శ్రీనివాస్ కుటుంబానికి కూడా అండగా నిలవాలని పవన్ విజ్ఞప్తి చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/