రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులపై రాజాసింగ్ అసహనం

rajasingh

రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనం వ్యక్తం చేసారు. తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ తరచూ రిఫేర్‌కు గురవుతుందని అన్నారు. ఉగ్రవాద దాడుల ముప్పు పొంచి ఉన్న తనకు ఇలాంటి వాహనం ఇవ్వటమేంటని ఆయన ప్రశ్నించారు. 4 నెలల క్రితం రోడ్డు మధ్యలో వెహికల్ ఆగిపోతే ఇంటెలిజెన్స్‌ ఆఫీస్‌కి తిరిగి పంపించాను. రిపేర్లు చేసి అదే వెహికల్‌ను మళ్లీ కేటాయించారు. 2 నెలల క్రితం నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లే సమయంలోనూ వెహికల్ ఆగిపోయింది. గన్‌మెన్ల సాయంతో ఆటోలో కోర్టుకు వెళ్లాను. అఫ్జల్‌గంజ్‌ వద్ద మరోసారి వెహికల్ ఆగిపోయింది. అప్పుడు సొంత వాహనం రప్పించుకుని వెళ్లాను. ఉగ్రవాదుల నుంచి దాడుల ముప్పు పొంచి ఉన్న నాకు ఇంటెలిజెన్స్‌ ఇలాంటి వాహనం ఇచ్చారు’ అని రాజాసింగ్‌ అసహనం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటె ఆగస్టు లో పిడియాక్ట్ కేసు ఫై రాజాసింగ్ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం ఆయన జైలు నుండి బయటకు వచ్చారు. తనపై ఉన్న పిడియాక్ట్ కేసు కోర్ట్ ఎత్తేసింది. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. హైకోర్టు షరతులు విధించడంతో ఎలాంటి ర్యాలీ లేకుండానే రాజా సింగ్ ఇంటికి చేరుకున్నారు.

ఎమ్మెల్యే రాజసింగ్పై హైకోర్టు పీడీయాక్టును ఎత్తేయటంతో బీజేపీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు.పెద్దఎత్తున బీజేపీ కార్యాలయానికి చేరుకున్న కార్యకర్తలు…టపాసులు కాల్చారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. పీడీయాక్టును ఎత్తివేయడంతో పాటు..బెయిల్ మంజూరు కావడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంతోషం వ్యక్తం చేశారు. ధర్మం విజయం సాధించిందని ట్విట్టర్ లో తెలిపారు.