పొత్తుల విషయమై పవన్ కీలక వ్యాఖ్యలు

The services of Police Officer Rajeshwari are commendable says pawan

ఏపీలో ప్రస్తుతం రాజకీయ పొత్తుల అంశం గురించి అంత మాట్లాడుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారనేది ఇప్పటి నుండే చర్చలు జరుపుతున్నారు. మరోసారి తెలుగుదేశం , జనసేన కలిసి బరిలోకి దిగబోతారని కొంతమంది అంటుంటే..లేదు లేదు జనసేన సింగిల్ గా దిగుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటె తాజాగా జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ఈ పొత్తుల అంశం పట్ల కీలక వ్యాఖ్యలు చేసారు.

మంగళవారం జనసేన కార్యనిర్వాహక సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయంలో తానొక్కడినే నిర్ణయం తీసుకోబోనని.., ప్రతి జనసైనికుడి ఆలోచనతోనే పొత్తులపై నిర్ణయం ఉంటుందని అన్నారు. ఇప్పటికే భాజపాతో జనసేన పొత్తులో ఉందన్నారు. పలు పార్టీలు జనసేనతో పొత్తు కోరుకోవచ్చునని.., అదంతా మైండ్ గేమ్ అనుకోవచ్చునని పవన్ అన్నారు. జనసేన క్షేత్రస్థాయిలో పుంజుకుంటోందని.. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టాలని జనసేన నేతలకు సూచించారు.