‘సినిమా టికెట్ ధరలు తగ్గించి..బస్ టికెట్ ధరలు ఎందుకు పెంచారు’

'సినిమా టికెట్ ధరలు తగ్గించి..బస్ టికెట్ ధరలు ఎందుకు పెంచారు'

రాష్ట్రంలో పేదవారికి ఉపయోగపడేలా సినిమా టికెట్ ధరలు తగ్గించమని చెపుతున్న ప్రభుత్వం..పండగవేళ బస్సు టికెట్ ధరలు ఎందుకు పెంచారని ప్రశ్నించారు దర్శకుడు , నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. రీసెంట్ గా ఏపీ సర్కార్ జీవో 35 ని తీసుకొచ్చి సినిమా టికెట్ ధరలను అమాంతం తగ్గించిన విషయం తెలిసిందే. రూ. 5 లకు టీ రాని ఈరోజుల్లో సినిమా టికెట్ ను తీసుకొచ్చి సర్కార్ వార్తల్లో నిలిచింది. ఈ ధరల ఫై సినీ పరిశ్రమే కాదు సామాన్య ప్రజానీకం కూడా మండిపడుతుంది. ఇదిలా ఉంటె తాజాగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ సినిమా వాళ్లపై చేసిన కామెంట్స్ మరింత వివాదాస్పదంగా మారాయి. ఇప్పటికే నిర్మాతల మండలి లేఖ రాయగా.. పలువురు సినీ ప్రముఖులు ప్రసన్న కుమార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ తరుణంలో తమ్మారెడ్డి సర్కార్ ఫై పలు ప్రశ్నలు వేశారు. ప్రసన్నకుమార్ రెడ్డి కులాన్ని టార్గెట్ చేయడంపై సరికాదు. గత కొద్ది సంవత్సరాల వరకు ప్రసన్నకుమార్ రెడ్డి కమ్మ పార్టీలో లేరా? ఆయన తండ్రి కమ్మల పార్టీలో ఉండలేదా? ఇప్పుడే కులం ప్రస్తావన ఎందుకు? ఇప్పుడు కమ్మ కులంపై విరుచుకపడటం ఎందుకు అని తమ్మారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లపైనే ఎందుకు పట్టింపు..? నిత్యావసర వస్తువుల ధరలు, పండుగ సమయంలో పేదలకు మేలు జరిగే బస్సు టికెట్ రేట్లు ఎందుకు తగ్గించరు? సినిమా టికెట్ రేటును 10, 20 రూపాయలు తగ్గించి.. మిగితా రేట్లు పెంచడం సరైనదా? అని తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు. ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఎవరైనా సినీ ప్రముఖులు కలిశారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కలవాలి.. వారికి ఎందుకు ఇంత అక్కసు అని ప్రశ్నించారు.

సినిమా పరిశ్రమలో బలిసిన వాళ్లు ఎవరున్నారో చూపించాలి. ఎమ్మెల్యేలు బలిసారా? లేక ఒక్క ఎమ్మెల్యేకి ఉన్న ఆస్తుల విలువ సినిమా పరిశ్రమలో ఎవరికైనా ఉందా చూపించాలి. అప్పుడే ఎమ్మెల్యేలు బలిసారా? లేక సినిమా వాళ్లు బలిసారా అనే విషయం తేటతెల్లం అవుతుంది. నోరుంది కదా అని బలుపు అంటూ బూతులు మాట్లాడటం సరికాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.