మే 08 న కర్నూల్ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన

Pawan-kalyan
Pawan-kalyan

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ..గత కొద్దీ రోజులుగా కౌలు రైతు భరోసా యాత్ర పేరిట ఆత్మ హత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి , వారికీ లక్ష రూపాయిల ఆర్ధిక సాయాన్ని అందజేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో ఈనెల 8వ తేదీన కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సిరివెళ్ల మండల కేంద్రంలోని రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. తొలి విడత ఉమ్మడి కర్నూలు జిల్లాలో 130 మంది కౌలు రైతుల కుటుంబాలకు సాయం చేయనున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ఉదయం 9.30 గంటలకు పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా చేరుకుంటారని మనోహర్ అన్నారు. జిల్లాలో గల శిరివెళ్ల మండల కేంద్రంలో రచ్చబండ కార్యక్రమంలో పవన్ పాల్గొంటారని నాదెండ్ల తెలిపారు. తొలివిడతలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 130 కౌలు రైతు కుటుంబాలకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం అందిస్తారు. మిగిలినవారికి రెండో విడతలో సాయం అందించనున్నట్టు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు చౌకబారు విమర్శలు మానుకోవాలని, రైతులకు సాయం అందించే పని పై దృష్టి పెట్టాలి అని, రైతు భరోసా యాత్ర రైతులకు కొండంత నమ్మకాన్ని కలిగిస్తున్న విషయాన్ని గ్రహించి వైసీపీ నేతలు ఇలాంటి చౌకబారు విమర్శలకు దిగుతున్నారని అన్నారు.