మొక్కజొన్న పొత్తులు కాల్చిన వైస్ షర్మిల

ప్ర‌జా ప్ర‌స్థానం యాత్ర‌లో భాగంగా వైస్ ష‌ర్మిల ప్ర‌స్తుతం ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో తన పాదయాత్ర ను కొనసాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం ఆమె దేవ‌ర‌క‌ద్ర‌లో పాద‌యాత్ర‌ను కొన‌సాగించారు. ఈ సంద‌ర్భంగా మొక్కజొన్న పొత్తులు విక్ర‌యిస్తున్న ఓ మ‌హిళ వ‌ద్ద కూర్చుని… నిప్పుల‌పై మొక్క‌జొన్న పొత్తుల‌ను పెట్టి ఓ సిల్వ‌ర్ ప్లేట్‌తో వాటిని కాల్చారు. ఇలా ఆమె చేయడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాప్రస్థానం సబ్బండ వర్గాల సమాహారమ‌ని పేర్కొన్నారు. యాత్ర‌లో ప్రతి ఒక్కరి బాధలు వింటామ‌న్న ష‌ర్మిల‌… అంద‌రినీ వెన్ను తట్టి భరోసా కల్పిస్తామ‌ని తెలిపారు. అధికారంలోకి వచ్చాక రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులతో పాటు చిరు వ్యాపారులకు అండగా ఉంటామ‌ని ఆమె ప్ర‌క‌టించారు. ఇక పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ టిఆర్ఎస్ సర్కార్ ఫై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. రాబోయేది వైస్సార్ రోజులని , ప్రజల కష్టాలన్నీ తీరిపోతాయని ఆమె ప్రజలకు తెలుపుతుంది.