ఉగాది పర్వదినాన జనసేనాధినేత కీలక ప్రకటన ..

ఉగాది పర్వదినాన జనసేనాధినేత కీలక నిర్ణయం తీసుకున్నారు. పంట నష్టాలతో ఆత్మహత్య చేసుకున్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయిల ఆర్ధిక సాయం అందజేయబోతున్నట్లు తెలిపారు. అన్నపూర్ణ లాంటి ఉభయ గోదావరి జిల్లాల్లోనే 73మంది కి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారంటే సాగును నమ్ముకొన్నవారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం అవుతోందన్నారు. ప్రతి కౌలు రైతు కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ భరోసా ఇచ్చారు.

ఏపీలో పంట నష్టాలతో ఆత్మహత్య చేసుకున్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలను ఆదుకుంటామని పవన్ ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వారి పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు కొంతైనా అండ ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ ప్రకటించారు. అంతేకాదు త్వరలోనే ప్రతి కుటుంబాన్నీ తానే స్వయంగా పరామర్శిస్తానని చెప్పారు. కౌలు రైతులు సాగు చేసుకుంటే రుణం ఇవ్వరు, నష్టపోతే పరిహారం కూడా ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశారు.

లు రైతుల బాధలు వింటుంటే హృదయం ద్రవిస్తుంది. కౌలు రైతుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందట్లేదు. రైతులు, కౌలు రైతుల పక్షాన జనసేన పార్టీ నిలుస్తుంది’’ అని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. ఉగాది పూట ఆ కుటుంబాలు దుఖంతో, బాధతో ఉండకూడదు… వారికి కొంతైనా ఊరటను ఇవ్వాలి అనే ఉద్దేశంతో జనసేన పక్షాన ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించామన్నారు.