అమెరికాలో గత 24 గంటల్లో 21,551 కొత్త కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,03,308..మొత్తం మృతుల సంఖ్య 90,347

america- corona virus

అమెరికా: అమెరికాలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 21,551 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనాతో 785 మంది మృతి చెందారు. ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 15,03,308గా ఉంది. మృతుల సంఖ్య 90,347కి చేరిందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. కరోనా వైరస్‌తో ప్రపంచ మొత్తం నమోదైన మృతుల సంఖ్యలో మూడో వంతు అమెరికాలోనే ఉన్నాయి. ఆ దేశంలోని న్యూయార్క్‌లో ఇప్పటివరకు 3,51,371 పాజిటివ్‌ కేసులు, 28,339 మరణాలు నమోదయ్యాయి. న్యూజెర్సీలో 1,48,240 కరోనా కేసులు, 10,439 మరణాలు సంభవించాయి. ఇల్లినాయిస్‌లో‌ 96,485, మసాచుసెట్స్‌ లో 87,052,, కాలిఫోర్నియాలో 81,738 కేసులు నమోదయ్యాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/