పుష్ప లో మంగ‌ళం శ్రీనుగా కనిపించబోతున్న సునీల్

కమెడియన్ సునీల్ ప్రస్తుతం హీరో గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా విలన్ గా కూడా నటిస్తున్నాడు. వాటిలో పుష్ప మూవీ ఒకటి. అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. మొదటి భాగం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17 న విడుదల కాబోతుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ ను స్పీడ్ చేసారు. ఇప్పటికే చిత్రంలోని ఒక్కో సాంగ్ సినిమా ఫై అంచనాలు పెంచేస్తుండగా..తాజాగా సునీల్ పాత్ర తాలూకా ఫస్ట్ లుక్ ను విడుదల చేసి ఆకట్టుకున్నారు.

ఈ చిత్రంలో సునీల్ మంగ‌ళం శ్రీను అనే పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, ఆయ‌న లుక్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఇందులో సునీల్ బ‌ట్ట‌ త‌ల‌తో, భ‌యంక‌ర‌మైన ఎక్స్‌ప్రెష‌న్ ఇస్తూ క‌నిపించాడు. సునీల్ లుక్ చూసి అంద‌రు స్ట‌న్ అవుతున్నారు. తొలి పార్ట్‌లో సునీల్ విల‌న్‌గా క‌నిపించ‌నుండగా, ఈ పాత్ర ఆయ‌న‌కు మంచి పేరు తీసుకురావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగా చిత్తూరు జిల్లా నేపథ్యంలో అక్కడి శేషాచలం అడవుల్లో జరుగుతోంది. ఈ సినిమాలో ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు.