వైసీపీ సర్కార్ ఫై పవన్ చివాట్లు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్..వైసీపీ సర్కార్ ఫై ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో భారీ వర్షాలు పడి వేలాది ఎకరాలు నీట మునిగాయి. వందల ఇల్లు వరదల్లో కొట్టుకుపోయాయి. పదుల సంఖ్యలో మనుషుల ప్రాణాలు పోయాయి. పచ్చని పొలాల్లో ఇసుక మేటలు వేసి ఏడుస్తుంటే ఈ సమయంలో ఇసుక అమ్ముతాం అంటూ ప్రకటన చేయడం పట్ల పవన్ ఫైర్ అయ్యారు.

ఈ ప్రభుత్వానికి ప్రజా క్షేమం అక్కరలేదా అంటూ ప్రశ్నించారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా ?? అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్ని స్తే వారిపై వ్యక్తిగత దాడులకు దిగుతూ దూషిస్తున్నారని ఇది సమంజసం కాదని ఆయన పేర్కొ న్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించు కోవాలన్నారు.రాష్ర్టం ఓ వైపు వరదలతో సతమతమ వుతుంటే మరోవైపు ఇసుక అమ్మకాలకు ప్రకటనలు ఇవ్వడం ప్రభుత్వ లాభా పేక్షకు నిదర్శనమని ఆయన అన్నారు.

వరదల భీభత్సం ఒక వైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే,ప్రజల ఇళ్ళు-వాకిళ్లు, పశు నష్టం – పంట నష్టం,
పచ్చటి-పొలాల్లో ఇసుక మేటలు వేసి ఏడుస్తుంటే , ఇలాంటి
సమయంలో వైసీపీ ప్రభుత్వం ‘యిసుక అమ్ముతాం ‘ అన్న ప్రకటనలు ఇస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా ?? pic.twitter.com/43GorfXoZg— Pawan Kalyan (@PawanKalyan) November 21, 2021