వైస్సార్సీపీ ఎంపీలు కనీసం ప్లకార్డులు పట్టుకోవట్లేదు : పవన్
అవసరమైతే ప్రాణ త్యాగాలూ చేస్తామని చెప్పారన్న పవన్
Pawan kalyan
అమరావతి : విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంపై స్పందిస్తూ వైస్సార్సీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ అంశంపై కనీసం ప్లకార్డులు కూడా పట్టుకోవట్లేదని ఆయన విమర్శలు గుప్పించారు.
”వైస్సార్సీపీ ఎంపీలు కనీసం ప్లకార్డులు పట్టుకోండి చాలు. విశాఖ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో ‘వైస్సార్సీపీ నేతలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ప్రాణ త్యాగాలు చేసైనా సరే అడ్డుకుంటాం’ అని చెప్పారు. అంత త్యాగాలు అక్కర్లేదు, కనీసం ప్లకార్డులు పట్టుకోండి చాలు” అని పవన్ కల్యాణ్ అన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/