శ్యామ్ సింగ రాయ్ కు పెద్ద షాక్ ఇచ్చిన పుష్ప రాజ్

వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న నేచురల్ స్టార్ నాని..ప్రస్తుతం శ్యామ్ సింగ రాయ్ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు. రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్లో వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి, మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24 న ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్..నానికి పెద్ద షాక్ ఇచ్చాడు.

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న పుష్ప మొదటి భాగాన్ని డిసెంబర్ 17 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దానికి తగ్గట్లే ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయినా వారం రోజులకు శ్యామ్ సింగ రాయ్ వస్తుంది. అయితే ఇప్పుడు పుష్ప రిలీజ్ డేట్ ను మార్చాలని భావిస్తున్నారట. డిసెంబర్ 17 న కాకుండా 25 న రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారట. సినిమా షూటింగ్ ఆలస్యం కావడం తో రిలీజ్ డేట్ ను మార్చుకున్నట్లు చెపుతున్నారు. ఒకవేళ ఇది నిజమైతే శ్యామ్ సింగ రాయ్ కు నష్టం వాటిల్లడం ఖాయం. మరి పుష్ప నుండి రిలీజ్ డేట్ వచ్చాక శ్యామ్ సింగ రాయ్ రిలీజ్ డేట్ ను చేంజ్ చేసుకుంటారేమో చూడాలి.