మధుమేహం నివారణకు ఫలం బొప్పాయి

PAPAYA-
PAPAYA-

బొప్పాలో అందరికీ అందుబాటులో ఉండే పండ్లలో బొప్పాయి ఒకటి. రోజూ ఒక చిన్న కప్పు బొప్పాయి ముక్కల్ని తింటే ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. బొప్పాయిలో ఉండే పీచు రక్తపోటుని నియంత్రిస్తుంది. విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు, రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా అడ్డుకుంటాయి. దాంతో బయివు నియంత్రణలో ఉంటుంది. ఇందులో చక్కెర శాతం తక్కువ. గుండె పనితీరు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. బొప్పాయి పండుకి నొప్పుల్ని నిరోధించే గుణం ఎక్కువ. ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది. కీళ్ల నొప్పుల బారిన పడకుండా కాపాడుతుంది. హార్మోన్లను సమన్వయం చేస్తుంది. నెలసరి సమస్యను క్రమబద్ధం చేస్తుంది. పచ్చిబొప్పాయిని తినడం వల్ల బాలింతలకు పాలు సమృద్ధిగా వస్తాయి. కెరోటినాయిడ్స్‌, పాలీఫినాల్సూ, విటమిన్లు పుష్కలంగా ఉండే బొప్పాయి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కణజాలాల పనితీరుకి తోడ్పడుతుంది. దీనిలో ఉండే ఎ విటమిన్‌ వల్ల చర్మం మెరుపుని సంతరించుకోవడంతో బాటు శిరోజాల పెరుగుదలకు బాగుంటుంది. బొప్పాయి గుజ్జుని ముఖానికి ఒంటికి రుద్దితే చర్మం మీద పేరుకున్న మలినాలన్నీ తొలగిపోతాయి. ఎండకు కమిలిన చర్మం తిరిగి తేజోవంతమవుతుంది. ఇందులోని లైకోపీన్‌ ముడతల్ని తగ్గిస్తుంది. ఇది మంచి క్లెన్సింగ్‌ లోషన్‌. బొప్పాయిలోని పీచు మధుమేహులకు మంచిది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా పచ్చి బొప్పాయిలో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మధుమేహం నియంత్రలో ఉంచుతుంది. ఇది ఆకలిని పుట్టించి నాలుకకి రుచి తెలిసేలా చేస్తుంది. పీచుతో పాటు ఇందులో ఉండే పొటాషియం, ఇతర విటమిన్లు హృద్రోగాల్ని రానివ్వవు.
ఎముకల పరిపుష్టికి ఇందులోని విటమిన్‌ కె ఎంతో తోడ్పడుతుంది. ఇది శరీరం కాల్షియంను పీల్చుకునేలా చేయడంతో బాటు ఎముకలు బలంగా ఉంటాయి. శరీరభాగాల్లో తలెత్తే ఇన్‌ఫ్లమేషన్‌ లేదా మంటని తగ్గించేందుకు ఇందులోని కొలీన్‌ ఎంతో సహాయపడుతుంది. డెంగీ జ్వరంలో రక్తంలోని ప్లేట్‌లెట్స్‌ పడితాయన్నది తెలిసిందే. అయితే ఆ సమయంలో కాసిని బొప్పాయి ఆకుల్ని రసం పిండి తాగితే వాటి సంఖ్య పెరుగుతుందని పోషకనిపుణులు చెపుతున్నారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com