గాడ్ ఫాదర్ 9 రోజుల కలెక్షన్స్
బాక్స్ ఆఫీస్ వద్ద గాడ్ ఫాదర్ హావ తగ్గుతుంది. దసరా సెలవులను బాగానే క్యాష్ చేసుకున్న గాడ్ ఫాదర్ ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద హావ తగ్గుతూ వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ దసరా సందర్బంగా గ్రాండ్ గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా.. RB చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.
సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలను పోషించగా , థమన్ మ్యూజిక్ అందించారు. ఇక ఆచార్య మూవీ ప్లాప్ కావడంతో మెగా అభిమానులు గాడ్ ఫాదర్ మూవీ ఫై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్.
ఇక 9 రోజుల్లో ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
నైజాంలో రూ. 11.81 కోట్లు
సీడెడ్లో రూ. 9.13 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ. 5.49 కోట్లు
ఈస్ట్ గోదావరిలో రూ. 3.53 కోట్లు
వెస్ట్ గోదావరిలో రూ. 2.15 కోట్లు
గుంటూరులో రూ. 3.79 కోట్లు
కృష్ణాలో రూ. 2.56 కోట్లు
నెల్లూరులో రూ. 1.93 కోట్లతో కలిపి రూ. 40.39 కోట్లు షేర్, రూ. 66.45 కోట్లు గ్రాస్ వచ్చింది.
కర్నాటకలో రూ. 4.57 కోట్లు
రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 4.70 కోట్లు
ఓవర్సీస్లో రూ. 4.87 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 54.53 కోట్లు షేర్, రూ. 99.00 కోట్లు గ్రాస్ వసూలు రాబట్టినట్లు అయ్యింది.