ఊతప్పం తయారీ ఇలా

Utappam Making

కావలసిన పదార్థాలు

మినప్పప్పు – 100 గ్రాములు
బియ్యం – 50 గ్రాములు
తరిగిన క్యాబేజి, క్యారెట్‌, బీన్స్‌, టమాటో, ఉల్లిపాయలు – అరగిన్నెడు
నూనె – 2 స్పూన్లు
ఉప్పు – తగినంత

తయారుచేయు విధానం

బియ్యం, మినప్పప్పు నీటిలో ఒక గంట సేపు నానపెట్టాలి. వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. పెనంపై నూనె వేసి రుబ్బిన మిశ్రమాన్ని సమంగా గుండ్రంగా పరచాలి. తరిగి ఉంచుకున్న కూరముక్కల్ని జల్లి, నెమ్మదిగా నొక్కితే ముక్కలు పిండిలో అద్దుకుంటాయి. లేత బ్రౌన్‌ కలర్‌లోని వచ్చాక, ఊతప్పాన్ని రెండో వైపున తిప్పుకోవాలి. రెండువైపులా ఉడికాక తీసివేసి సాంబారుతోగాని, పచ్చడితోగాని నంజుకుని తింటే రుచిగా ఉంటుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/