పల్లా రాజేశ్వర్ రెడ్డి దగ్గరుండి దాడి చేయించాడు – రాజగోపాల్

clash-between-trs-and-bjp-at-palivela-of-munugode-mandal

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం చివరి సమయంలో ఉద్రిక్తలకు దారితీసింది. పలివెలలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రచారం చేస్తున్న క్రమంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాన్వాయ్ ఫై రాళ్ల దాడి చేసారు. ఈ దాడి లో 20 మందికి పైగా బిజెపి కార్య కర్తలకు గాయాలు అయ్యాయి. అలాగే పలు వాహనాలు ధ్వసం అయ్యాయి. ఈ దాడి ముమ్మాటికీ టిఆర్ఎస్ పార్టీనే చేసిందని బిజెపి ఆరోపిస్తుంది. ఇప్పటికే ఈ దాడిని ఈటెల రాజేందర్ ఖండించగా..బిజెపి అభ్యర్థి రాజగోపాల్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ డైరెక్షన్ లోనే మునుగోడులో టీఆర్ఎస్ శ్రేణులు ఈ దాడులు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

ఇప్పటికే నాలుగుసార్లు దాడికి యత్నించారని, ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ నేతలు ఇలా దాడులు చేయిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి దగ్గరుండి ఈ దాడి చేయంచాడన్న ఆయన… టీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతం కాదన్నారు. భయపడకుండా ధర్మం వైపు నిలబడాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఏం చేసినా మునుగోడులో బిజెపి పార్టీ నే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు. కాన్వాయ్ పై జరిగిన దాడిలో గాయపడ్డవారిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు.