‘పక్కా కమర్షియల్’ షూటింగ్ పూర్తి..

ప్ర‌తి రోజు పండ‌గే లాంటి మెగా హిట్ తర్వాత ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి నిర్మిస్తున్న ఈ మూవీ లో మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా నటిస్తుండగా రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్ట‌ర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్‌లో ఎప్పుడూ లేనంత కొత్త‌గా గోపీచంద్ చాలా స్టైలిష్‌గా క‌నిపిస్తున్నాడు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

కాగా తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. చాలారోజులగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యంగా జరుగుతుండటంతో ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ముగించుకోవడంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకున్నారు. సెట్స్‌లో చివరిరోజు కావడంతో, చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సినిమాను జూలై 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండగా, జూన్ 12న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. మరి పక్కా కమర్షియల్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.