అందుకే క్రాస్ ఓట్ వేశా.. జేడీఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ

కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ..కాంగ్రెస్‌ పార్టీని ప్రేమిస్తున్నా.. శ్రీనివాస్ గౌడ

బెంగళూరు: కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరిగాయి. ఈ నాలుగు స్థానాలకు గాను ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. జేడీఎస్ కు చెందిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ ఓటు వేయకుండా ఖాళీ బ్యాలెట్ పేపర్ ను సమర్పించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఆయన ఖండించారు. తాను ఓటు వేశానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి క్రాస్ ఓటు వేశానని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ ను ప్రేమిస్తున్నానని… అందుకే ఆ పార్టీకి ఓటు వేశానని తెలిపారు. క్రాస్ ఓటు వేసిన శ్రీనివాస్ గౌడ కాంగ్రెస్ లో చేరుతానని గతంలో ప్రకటించిన సంగతి గమనార్హం.

మరోవైపు, క్రాస్ ఓటింగ్ కు భయపడిన జేడీఎస్ పార్టీ తన ఎమ్మెల్యేలను రిసార్ట్ లో ఉంచింది. అయినప్పటికీ ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురిచేసిందని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి మండిపడ్డారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/