పక్కా కమర్షియల్ ‘పక్క రిలీజ్ డేట్’ ఇదే

ప్రతి రోజు పండగే లాంటి మెగా హిట్ తర్వాత దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ లో మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా నటిస్తుండగా రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మధ్యే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు దర్శక నిర్మాతలు.
వచ్చే ఏడాది మార్చి 18న పక్కా కమర్షియల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్‌లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఈ మూవీ తో మారుతీ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.