కేసీఆర్ డ్రామా ఆడుతున్నాడంటూ కేంద్ర జల్‌శక్తి మంత్రి ఫైర్ ..

తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న నీళ్ల గొడవ ఫై కేంద్ర జల్‌శక్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌ స్పందించారు. మొన్న‌టి ప్రెస్‌ మీట్‌లో సీఎం కేసీఆర్ రాష్ట్రాల పునర్విభజన అనంతరం నీటి కేటాయింపులు చేయాలని కోరామని.. కేంద్ర స్పందించడం లేదంటూ కేసీఆర్ కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు. కేఆర్‌ఎంబీ, జీఆర్ఎంబీ అంటూ కుంటిసాకులు చెబుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర జలమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పేరును ప్రస్తావిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కోర్టులో కేసు వెనక్కి తీసుకోమంటే తీసుకున్నామని.. అయినా ఏమీ చేయడం లేదంటూ దుయ్యబట్టారు. ఈ క్రమంలో జల్‌శక్తి మంత్రి గ‌జేంద్ర ..కేసీఆర్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.

మొన్న‌టి ప్రెస్‌ మీట్‌లో కావాల‌ని సీఎం కేసీఆర్ నా పేరు ప్ర‌స్తావ‌న‌కు తెచ్చారన్నారు. అందుక‌ని నేను రెస్పాండ్ కావాల్సి వ‌స్తోందన్నారు. అస్స‌లు నాకు దానితో సంబంధ‌మే లేదన్నారు. 2015లో కొత్త ట్రిబ్యునల్ ఎర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందన్నారు. కావాల‌నే కేంద్రాన్ని కేసీఆర్ బ‌ద్నాం చేస్తున్నారని చెప్పారు మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఇద్ద‌రు సీఎంల అంగీకారం త‌ర్వాతే ట్రిబ్యున‌ల్ ఏర్పాటు జ‌రుగుతుందన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం 2020లో నిర్వహించానని.. 2020 , 6 అక్టోబర్ లో సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ను..రెండు రోజుల్లో వెనక్కి తీసుకుంటానన్న కేసీఆర్ …8 నెలల తర్వాత కేసును ఉపసంహరించుకున్నారని చెప్పారు. నెల రోజుల క్రితం సుప్రీం కోర్టులో పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇచ్చిందని.. ఇప్పుడే మేము పని మొదలు పెట్టామని అన్నారు. కేసీఆర్ కారణంగానే ఇంత కాలం ఆలస్యమైందన్నారు.